Mar 31, 2010

దైవం

మనకి అర్థం కానిదంతా దైవ మాయే. 
భూగోళాన్ని అపకేంద్ర , అభికేంద్ర బలాలు ఒక నిద్రిష్ట కక్షలో తిరిగేలా చేయటం, పదార్థంలో పరమాణువుల అమరిక...తద్వారా  పదార్థ ధర్మ మార్పు, జంతుజాల జీవన క్రియలు  నుంచి మొదలు కొంటె ప్రతిదీ ఒక పద్దతి ప్రకారం జరుగుతూ ఉంటుంది. ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. 
మానవ మేధస్సు సృష్టి లో ఉన్న కొన్ని రహస్యాలని చేదించి స్వలాభానికి వాడుకుంటూ ఉంది.. కాని  సృష్టి కారణం, కారకులు, జీవం , జీవితం ..వీటిని ఇంకా నిర్వచించ లేక పోయింది . ఇక్కడే "దేవుడు" అన్న పదం ప్రతిపాదించ బడుతుంది..మనకి అర్థం కానిదంతా దైవ మాయే.

దేవుడు ఒక సాంఘీక  అవసరం

దేవుడు ఒక సాంఘీక అవసరం. ప్రజలు దేవుడి పేరుతో కొంత రిలాక్స్ అవ్తున్నారు. తమ తమ కోరికలని తీరుస్తాడని, ఆపదలనుంచి గట్టేకిస్తాడని, సమస్యలని పరిస్కరిస్తాడని నమ్ముతున్నారు. ఆ నమ్మకం లో బ్రతకక పోతే వ్యక్తీ గతంగా, సాంఘీకంగాఅశాంతి ప్రబలి పోతుంది. సమాజం లో విలువలు నశిస్తాయి. అవి పోయిన నాడు లోకం నరకం. ఇప్పటికే చాల శాతం మంది బ్రతుకు పోరాటం లో, ఆశల వాహినిలో, సుఖ భోగ లాలసలో పడి విలువలు మరిచి దోపిడీలు , దొంగ తనాలు, మోసం, హత్యలు , అత్యాచారాలు చేస్తున్నారు. ఇక దేవుడు అనేది గుడ్డి నమ్మకమే అని తెలిసిందో... ప్రపంచం వల్లకాడైపొదూ  ..

ఒక దానికి surrender కావాలి 

మనిషి దేనికో ఒక దానికి surrender కావాలి . అదొక ఆనందం. దానినే ప్రపత్తి అంటారు. మన అహంని మరిచిపోయి ఎవరికో ఒకరికి, దేనికో ఒన దానికి అర్పణ కావాలి..
దేనికి కావలి.?? ఎవరికీ కావాలి??
నీకా? కాని నీలో నాకు లోపాలు కనపడుతున్నాయే..నాకంటే గొప్పగా కనిపించటం లేదే నీవు ??
మరి ఎలా...
సరిగ్గా అప్పుడే "దేవుడు" ఒక అవసరం అవుతుంది ఎవరికైనా. ఎవరితో మనం మనని మరిచిపోయి, ముసుగు తొలగించి, మంచి చెడు చెప్పుకొని. ఏడ్చి, నవ్వి, ఒదార్చుకొని..స్వాంతన పొందుతామో అదే దేవుడు.
ఆ దేవునికి మనని మనం అర్పణ చేసుకొని, ఆ ప్రపత్తి లోఉన్న ఆనందాన్ని అనుభవిస్తున్నాం.
అందుకే దేవుడిని idealize చేసి, సకల గుణగణుడుగా, మహా శక్తి సంపన్నుడుగా, దయామయుడిగా, ఆపద్భంధవుడిగా, కొంగు బంగారంగా కీర్తిచి...స్తుతించి, శ్లాఘించి  స్వాంతన ఆనందాన్ని పొందుతున్నాం.
సంగీత మాదుర్యము, భక్తి ప్రపత్తి, సాహిత్య పు గారడీ కలగలిసి మన మనసులో పుట్టించే ఆనంద తరంగాలు మనని ఒలలాడిస్తాయి .

దేవుడంటే ....????

 ఏ శక్తి జీవ చైతన్యానికి ఆధారమో,ఏ శక్తి పూలకి రంగుగా మారుతుందో.. ఏ శక్తి పక్షి రెక్కలో దూరి దాన్ని గాల్లో తెలుస్తుందో.. ఏ శక్తి భూమిని గాల్లో పట్టి ఉంచిందో.. ఏ శక్తి మనని పలికిస్తుందో,నడిపిస్తుందో, పరుగులేట్టిస్తుందో, మన ఆలోచనలకి ఆధారమో, . .. ఏ శక్తి మాటై, పాటై మాధుర్యమై మనని అలరిస్తుందో, ఏ శక్తి వేలుగునీడలో సృష్టిస్తుందో, ఏ చైతన్యం విత్తు లో ఉన్న జీవాన్ని మేలుకొలిపి భూమిని చీలుచుకొని మొలకగా మారుస్తుందో.. ఆ శక్తి చైతన్యమే దేవుడు.

దేవుడు మీ కోరికలు తీర్చడు.

నిజం..

దేవుడు మీకోరికలు తీర్చడు. అరిచి గీ పెట్టు.. లక్ష కొబ్బరికాయలు కొట్టు.. గుండు గీయించుకొని తిరుగు జన్మంతా.. దేశం లోని గుళ్ళు గోపురాలు చుట్టబెట్టు ... ఎమన్నా చెయ్యి ...మీ   కోరిక తీర్చడు..

మీకు మీరు .. హృదయంతరాళం లోనుంచి .. ఫీల్ అయ్యి.. sincere గా శ్రమిస్తే మీ  కోరిక నెరవేరుతుంది..

మనకి కావలసినవి కోరుకోటానికి.. ..అనుకున్నది తీరక పోతే గుండె మండి తిట్టు కోటానికి దేవుడు కావలి. 

 



Mar 22, 2010

అసలైన అబలత్వం

మొన్నెపుడో  ప్రపంచ మహిళా దినోత్సవం  జరిగింది. మహిళలందరూ ఒక చోట చేరి " మహిళ గొప్పతనం, కుటుంబానికి, సమాజానికి మహిళ ఎలా సేవ చేస్తుందో, తామెంత ముక్య పాత్ర పోషిస్తున్నారో తెలియజెప్పారు. సమాజం లో ఎలా దూసుకుపోతున్నారో, ఎలాంటి ఇబ్బందులు ఎదురుకుంటున్నారో , ఎలాంటి ఆపదలు ఎదురు కావోచ్చో, వాటిని ఎలా face చేయాలో  వివరించారు. మహిళా బిల్లు అదేంటో నాకు తెలియదు కాని దాని గురించి కూడా చర్చించారు.
ఆడది ఆబల  కాదు సబల అని చాల మంది మహిళలు prove చేసారు, చేస్తున్నారు.
కాని నేను గమనించింది ఏంటంటే... ఇల్లు విడిచి ఉద్యోగాలు చేస్తున్నా , విమానలేక్కి గాల్లో చక్కర్లు కొడుతున్నా.. పొలిసు మిలిటరీ దళాల్లో  చేరి దైర్య సాహసాలు ప్రదర్శిస్తున్నా.. కొన్ని విషయాలలో మాత్రం ఆడది ఆబాల గానే మిగిలిపోయిందేమో అని అనుమానం .
ఉద్యోగం చేసినా, ఊళ్ళేలినా  ఇంటికొచ్చి  కన్నీటి చిట్టా విప్పుతుంది. చున్ని అంచుతోనో.. tissue  paper   తోనో కళ్ళు, ముక్కు తుడుచుకొంతోంది. కారణం ఏదైనా కావొచ్చు. బాస్ తిట్టాడనో,  బాయ్ ఫ్రెండ్ ముఖం చాటేసాడనో, మొగుడు పట్టించుకోటం లేదనో.  
         స్త్రీ తత్వం సున్నితం, తద్వారా బాధ అనివార్యం. ఎంత సున్నితం గా ఉంటె అంతా బాధ. ప్రపంచ తత్వం, మగాడి గుణం తెలిసి కూడా,  సగం ఎదుర్కొని ఇంకో సగంలో ఓడిపోతోంది. ఇంటికొచ్చి ఏడవటం  అసలైన అబలత్వం. ముఖ్యంగా  relationships  విషయంలో మహిళ బాధని అధిగమించలేక పోతోంది.
ప్రపంచాన్ని గెలుస్తున్నాం.. కాని మనని మనం గెలవకలగాలి.. మన attitude ని మార్చుకోగాలగాలి. దాన్ని సాధన చేయాలి. ఇది సాధించిన  రోజున నిజమైన మహిళా దినోత్సవం.