యా.. సరదా డేట్...
శ్రుతి రెండేళ్లుగా ఇంటర్నెట్ లో పరిచయం..
అప్పుడప్పుడు sms .. ఫోన్ కాల్స్..
నెట్ లో కలిసిన ప్రతిసారి.. నేనూ కలుద్దాం అనటం.. ఆమె అవసరమా అనటం..
అల్ అఫ్ అ సడన్..
ప్రతిసారిలాగే..
కలుద్దామా అని నేను.. ఎప్పుడు?? అని ఆమె..
నిజమా అని నేను అడిగేన్తలో.. 11 కల్లా వోచ్చేయి .. లేకపోతే ...i will go to office
ఒహ్హ వొస్తున్నా...
చక చక తయారై..బయలుదేరా ( చిన్నప్పుడు సినిమా అంటే ఇలాగె అయ్యేవాడిని )
హాయ్.. how are u లు ఐపోయాక
శృతి అంటే ఇలా ఉంటుందా.. ఈమేనా... అని ఆశ్చర్యం ..
అ మాటలకి.. రూపానికి పోల్చుకోటం లో నేను...
మాటల్లో రౌడి లాగ ఉన్నావ్..కాని.. చూస్తే అలా అనిపించవ్ అని ఆమె..
ఆఫీసు వెళ్ళాలనిపించలేదు.. అది కాక నివ్ చాల రోజులనుండి కలుద్దాం అంటున్నావ్ కదా .....గొణుగు
అవునా.. అంటే టైం పాస్ కి అన్నమాట....
హే కాదు.. కలుద్దాం అంటున్నావ్ కదా.. అందుకే...
సర్లే .. ఇంకా...
ఈ మాటల్లో లంచ్ అయింది..
నేను : అండ్ నౌ.. హే లాంగ్ డ్రైవ్ వెళ్దామా..?
శ్రుతి : ఎక్కడికి..??
నేను : ఏమో.. అలా .. may be చిల్కూర్..
శృతి : అంత దూరమా.. ఇంత ఎండలోన..
నేను : అంత దూరం కాకపోతే .. సగం దూరం వెళ్దాం..వెనక్కి వోచ్చేద్దాం ..ఏమంటావ్ ??
శృతి: సరే నీ ఇష్టం..
నేను : ఓకే.. ( అని..బైక్ మెహది పట్నం వైపు పోనిచ్చా..)
ఎదురుగ.. flyover .. నాకు అది airport fly over అని తెలిదు..
అది కాక చాల పెద్ద లెటర్స్ తో రాసారు.. Two wheelers are strictly not allowed అని.. అది కుడా కనపడలేదు.
flyover ఎక్కించా..
ఖాలిగా ఉంది.. స్పీడ్ పెంచా...
అప్పుడు చెప్పింది.. శృతి.. హే.. ఎందుకు దీనిమీదకి తెచ్చావ్..
two wheelers are strictly not allowed అని రాసారు గా
అవునా..అయ్యో ..నేను చుడలేదు..ఇప్పుడెలా??
అయితే వెనక్కి తిప్పు..
తిప్పుదామనే అనుకున్నా.,కాని వెనక్కి రావటానికి దారి లేదు..
అడపా దడపా ఎదురుగ కార్లు తప్ప ఒక్క two wheeler కూడా రావటంలేదు..
కనిసం ఒక్కడైనా రావోచ్చుగా నాకు తోడుగా..
ఎంత దూరం పోయినా.. fly over ఐపోటం లేదు.. వొస్తూనే ఉంది రోడ్డు..
అయ్యో..ఎలా అంది..తెగ టెన్షన్ తో అంది శృతి..
అయిందేదో అయింది..అవతలి చివర వొచ్చేదాకా enjoy the ride ..
మహా అయితే 500 /- ఫైన్ ఉంటుంది ..
11 km ఎవ్వరు లేని మెలికల రోడ్డు...మాకోసమే వేశారా అనిపించింది..
THE END రానే వొచింది..ఆపనే ఆపాడు ... చిన్న ట్రాఫిక్ గుడిసె..దాన్లో ఉన్న ట్రాఫిక్ భటుడు..
సర్.. తెలీకుండా వచ్చాం ..బోర్డు కనపడలేదు.. వెనక్కి వెళ్దాం అనుకుంటే.. దారి కూడా లేదు... (కొంచం లో వాయిస్ లో చెప్పా)
అయితే ఫైన్ కట్టు..
ఎంత ...అని నోట్లోకి వొచ్చేసేదే ..
కాని..ఏ ట్రాఫిక్ పోలీసు పట్టుకున్నా.. వొచ్చే రేగులేర్ మాట... దానికంటే ముందు వొచ్చేసింది తెలీకుండానే..
"నేను ప్రెస్ "
మరి ముందే చెప్పోచుగా..అని చిరునవ్వు తో లోపలికెల్లిపోయాడు.
వెనక పిల్లకి టెన్షన్ సడన్ గా మైనస్ లో కి పడిపోయింది..
:) :)
ఇంకంతే......