Jan 8, 2010

మతం.. దేవుడు.. పాపం.. పుణ్యం..


Free Music

మతం.. దేవుడు.. పాపం.. పుణ్యం..
దేవుడికి రూపం లేదు.. అసలు దేవుడే లేదు.  ఉన్నది ఒకటే అది "దైవ తత్వం" ... అది దైవత్వం.. . మానవత్వం పరిపక్వం అయినపుడు దైవత్వానికి చేరువవుతూ ఉంటాడు మనిషి.
మానవత్వపు విలువలు ఏంటో మనకందరికీ తెలిసిందే. అవి సంపూర్ణంగా వికసించిన నాడు మనిషి దైవత్వం వైపు పయనిస్తాడు  ...


ఈ నాడు హిందూ మతాన్ని, దాని మూలాల గురించి  మళ్లీ ఒక్కసారి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది .
ఎంతో మంది  హిందూ గురువులు కుడా రాముడు  కృష్ణుడు అంటూ  వాళ్ళ విగ్రహాలని పూజించడం..అభిషేకించడం చేస్తున్నారు.  పూజలు, వ్రతాలు, యజ్ఞాలు  .. ఇవన్నీ శుభం జరగాలని  కోరుతునో లేక  లోక కళ్యాణం కోసం   చేసే తంతుగా  ఒక get together లాగ ..ఒక పండగ లాగ కలిసి  ఆనందిచడానికి బానే ఉంటుంది.  .  కాని ఇదే మోక్షానికి మార్గం అంటే ఒప్పుకోటం కష్టం .


హిందూ మతం abstract. స్తూలంగా.. యితడు దేవుడు.. అని చెప్పడం అనేది లేనే లేదు. హిందూ మతం ఒక  తత్వం.. ఒక  జీవన శైలి.  సామాన్యుడికి అర్థం కావటానికి abstract విషయాలకి  ఒక  రూపాన్ని ఇచ్చి..వాటికి కథలు  అల్లి చెప్పేసరికి.. సామాన్యుడు అసలు విషయాన్ని మరిచి.. కథనే నిజముకోటం వల్ల  జరిగిన అనర్థం ఇది.
విద్య ని సరస్వతి అన్నారు..   సరస్వతి అనగానే..   కలువ పువ్వులో వీణ పట్టుకొని కూర్చునే అందమైన అమ్మాయి కాదు..  అది ఒక abstract  ఆలోచనకి  తెలిసి  తెలియక ఇచ్చిన  రూపం. దానికి విగ్రహాలు తాయారు చేసి అభిషేకిన్చగానే  విద్య రాదు. ఒక గౌరవభావం తో విద్య నేర్చుకోవాలని తాపత్రయ  పడితే విద్య వస్తుంది.సరస్వతి విగ్రహాన్ని అత్యంత భక్తిశ్రద్దలతో పూజించేవారు.. నేర్చుకునే  దగ్గర కోచ్చెసరికి అది చూపించరు. " విద్య "  దైవం అని చెప్పటం దీని అంతరార్థం.

లక్ష్మి అంటే సంపద కి చిన్హం . అది , ఐశ్వర్య  ధన, దాన్య, ధైర్య,సంతాన, రాజ్య,విజయ.... అష్ట లక్ష్మి లు సంపదలే. అంతే కాని తామర పువ్వులో కూర్చొని బంగారు నాణేలు రాల్చే అమ్మాయి కానే కాదు. కేవలం సంపద..ఏ  రూపంలో ఉన్నా సరే.ఆ సంపదని మనం గౌరవించాలి.
ఇలా చెప్పుకుంటూ పోతే సృష్టి,  స్థితి,  లయ కారకులు..అష్ట దిక్పాలకులు.. అందరు abstract నే. ఇలా మన దైనందిన జీవితంలో ఎదురయ్యే ప్రతిదాన్ని దైవంగా  పరిగణించటం హిందూ సంప్రదాయం. 

దేవుడు ఎవరయా అంటే..
" ఏదేవు దేహమున యిన్నియును జన్మించే.. ఏదేవుదేహమున యిన్నియును అణగెమరి,   ఏ దేవు విగ్రహంబీ సకల వింతయును.. ఏదేవు నేత్రంబులిన చంద్రులు ..
ఏ దేవు డీజీవులన్నింటి లో  నుండు.. ఏదేవు చైతన్య ఇన్నింటికాధారం  
మేదేవుడవ్యక్తు ....దేవుడద్వందు.. ఏ వేల్పు పాదయుగమిళయు నాకాశంబు .. ఏ వేల్పు  పాద కేశర్థంబనంతంబు ..

ఏ వేల్పు నిశ్వాస మీ మహా మారుతము   .....................
ఏ వేల్పు భువనైక హితమనో భావకుడు... -(అన్నమయ్య )



..అలాంటి వాడు ఎవడూ లేడు.. ఈ  సకల చరాచర ప్రకృతి, దాని తత్త్వం తప్ప.
చెట్టు, పుట్ట..జీవం,నిర్జీవం,చైతన్యం,
సమస్త సృష్టి... అంతా దైవమె. ఇదే హిందూ మతం చెప్పింది.
రామాయణ భారత భాగవతాలు, ఇతర పురాణాలు  అన్ని సామాన్యుడికి అసలు విషయం వివరించటానికి  చేసిన  ప్రయత్నాలు... వేదోపనిశాత్తుల్లో   ఉంది హిందుత్వం అంతా.
అది మరుగున పడేసి.. రామాయణ భారత  ముఖ్య  పాత్రలు ముందుకొచ్చాయి నేడు. రాముడు అనే పాత్ర ద్వార దైవ తత్వాన్ని భోదించటానికి ప్రయత్నించారు. కథలు,కావ్యాలు, పురాణాలు..వేదాలు కలగలిపి..కలగూరగంప చెసి..గందరగోళం చేసేసారు.
దేవుడిని  గూర్చి చెప్పిన ప్రతి వాడు దేవుడైపోయాడు  ఏదో రెండు మూడు చమత్కారాలు చేయగానే అతడిని .. అతని శ్లాఘిచి కీర్తించి..దేవుడిని చేసేసారు.దాంతోనే  ముక్తి దోర్కుతుందేమో అని  తపిస్తున్నారు. అది కేవలం భక్తి,  ప్రపత్తి లోంచి మానసికంగా వొచ్చే ఒకానొక రసానందం మాత్రమే. ఇంకా లోతైన ఆనందాన్ని చవి చూడాలి అంటే అంతర్ముఖులం  అయిపోవాలి. 

No comments: