Jan 27, 2010

ప్రేమ

మన మనసు ఒక feeling లోంచి ఇంకో feeling లోకి నిరంతరం చలిస్తూ ఉంటుంది.. ఏది ఖచ్చితం కాదు.. ప్రేమ నుండి సెక్స్ లోకి సెక్స్ లోంచి ప్రేమలోకి.. రొమాన్స్ నుండి సెక్స్ ki, సెక్స్ నుండి రొమాన్స్ కి ..ఇంకా వీలయ్యే అన్ని ఫీలింగ్స్ లోకి చలించడానికి వీలుంది.ఇది ఇలానే అని ఖచ్చితంగా చెప్పలేము. అందుకే పెళ్లి తరవాత ప్రేమ ..సెక్స్ తరవాత లవ్.. లవ్ నుండి జెలసి .. స్నేహం నుండి లవ్,, లవ్ తరవాత స్నేహం.. ఒక్కోసారి అన్ని కలిపి లేదా విడివిడిగా.. exist అవుతూ ఉంటాయి. 
మనసు చంచలమైనది.. అది ఒకసారి ప్రేమిస్తుంది.. ఒకసారి కామిస్తుంది.. ఒకసారి కరుణిస్తుంది ఒకసారి మోహిస్తుంది ..ఒకసారి వలపిస్తుంది..ఒకసారి ద్వేషిస్తుంది..ఒకసారి వాత్సల్యం కురిపిస్తింది..ఒకసారి భక్తి తో మొకరిల్లుతుంది..ఒకోసారి ఒక దాని తరవాత ఒకటి సంభవించవచ్చు..
అన్నింటిలోను సంపూర్ణం, అసంపూర్ణం ఉండనే ఉంటాయి..
మనం మొహాన్ని,, వలపుని, కామాన్ని..ఇష్టాన్ని..ప్రేమ గా అనుకుంటాం..ఇవన్నిన్తికంటే higher state లో ఉండేది ప్రేమ..
ప్రేమ ఉత్తమోత్తమమమైన అనుభూతి..దాన్ని సంపూర్ణంగా అనుభవించడం లేదా సాధన చేయటం చేయటం మనవ లక్ష్యం.చాల కష్ట సాధ్యం. ఒక జీసస్ క్రిస్ట్. ఒక మథెర్ తెరిస్సా..ఒక గాంధి..లాంటి వాళ్ళు.. కొంత దూరం వెల్ల గలిగారు..

Jan 9, 2010

ఎంతటి దుస్థితి !!!!


"వంట చేసేందుకు క్షవరానికీ, వండ్రంగానికి, భిక్షానికి  ట్రైనింగు  కావలి. కాని ప్రజలను ఏ వెర్రి ఉహలకయినా  ప్రోత్సహింపగల పత్రికాధిపతి కి మాత్రం ఎ విధమైన ట్రైనింగు అవసరం లేదు. డబ్బు... పత్రిక పెట్టాలనే "వేనిటి"  తప్ప.
 - చలం  "


మన టీవీ చానల్స్ ..మన రేడియో   మన పత్రికలూ.. .మన మీడియా
 YSR మరణాన్ని , తెలుగు సినిమా పాటలు జోడిచి పదే పదే చూపించి.. వందకి పైగా చావులకి కారణం ఐంది..
నిన్న తెలంగాణా ఉద్యమాన్ని అదే రకంగా చూపించి జనాల్లో విద్వంసకర చైతన్యాన్ని పురి కొల్పింది.
నేడు మళ్లీ  ఏదో చెత్త బ్లాగ్ ని ఫోకస్ చేసి..విద్వంసానికి నాంది పలికింది..
రాష్ట్రం లో దేశం లో జరిగే ప్రతి విద్వంసకర దుశ్చర్యకి పూర్తి భాద్యత మీడియా   దే. అది న్యూ చానలే కావొచ్చు.. "అ అంటే అమలాపురం" అని చంటి పిల్లలతో అర్ధనగ్నగా అసభ్యంగా డాన్స్ ప్రోగ్రాములు రూపొందిస్తున్న ఇతర చానెల్స్  కావొచ్చు.. భక్తి పేరుతో మత విశ్వాసాలను తద్వారా మత మౌడ్యాన్ని   పెంపోదిస్తున్న భక్తీ చానెల్స్  కావొచ్చు..
" హాయ్..భారతి "
హాయ్  whats ur name.. what  u do ?
ఐ అం నిహారికా..ఇంటర్ ఫస్ట్ ఇయర్..
ఓకే, కూల్.. bf ఉన్నడా..
లేడు..
ఆయ్యో లేడా ,,ఏం  ఎవ్వరు propose చేయలేదా ?" 
అంటూ పసి పిల్లలకి  ఒక ఉతాం ఉచ్చే  రేడియో  కావొచ్చు..


  నేటి మీడియా
1) కేవలం డబ్బు కోసమే ఆవిర్భావించటం.
2) ఒక ఆశయం ఒక దృక్పథం.. ఒక ఆలోచన లేకపోటం
3) మాస్ మీడియా కి ఉన్న శక్తి ఏంటో తెలియని వాళ్ళు ఆయా మీడియా కి heads గా ఉండటం.
4) కేవలం డబ్బు ఉంది చానెల్ ఓపెన్ చేయటం తప్ప..ఆ విషయం లో ఎలాంటి చదువు సంధ్యలు లేకపోటం.
5) సమాజం పై ,, సమాజ పురోగమనం పై.. తమకి ఉన్న భాద్యత తెలికపోవటం.
6) చెప్పిందే..చూపిన్చిన్దె    పదే పదే 24 గంటలు చూపించి.. జనాల ని భావోద్వేగంలోకి.. ఉన్మదంలోకి నెట్టటం.
7)మళ్లీ తమది భాద్యత కానట్టు.. ఈ ఉన్మాదాన్ని ఇంకో కథనంగా చూపించటం.
ఎంతటి దుస్థితి !!!!


Jan 8, 2010

మతం.. దేవుడు.. పాపం.. పుణ్యం..


Free Music

మతం.. దేవుడు.. పాపం.. పుణ్యం..
దేవుడికి రూపం లేదు.. అసలు దేవుడే లేదు.  ఉన్నది ఒకటే అది "దైవ తత్వం" ... అది దైవత్వం.. . మానవత్వం పరిపక్వం అయినపుడు దైవత్వానికి చేరువవుతూ ఉంటాడు మనిషి.
మానవత్వపు విలువలు ఏంటో మనకందరికీ తెలిసిందే. అవి సంపూర్ణంగా వికసించిన నాడు మనిషి దైవత్వం వైపు పయనిస్తాడు  ...


ఈ నాడు హిందూ మతాన్ని, దాని మూలాల గురించి  మళ్లీ ఒక్కసారి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది .
ఎంతో మంది  హిందూ గురువులు కుడా రాముడు  కృష్ణుడు అంటూ  వాళ్ళ విగ్రహాలని పూజించడం..అభిషేకించడం చేస్తున్నారు.  పూజలు, వ్రతాలు, యజ్ఞాలు  .. ఇవన్నీ శుభం జరగాలని  కోరుతునో లేక  లోక కళ్యాణం కోసం   చేసే తంతుగా  ఒక get together లాగ ..ఒక పండగ లాగ కలిసి  ఆనందిచడానికి బానే ఉంటుంది.  .  కాని ఇదే మోక్షానికి మార్గం అంటే ఒప్పుకోటం కష్టం .


హిందూ మతం abstract. స్తూలంగా.. యితడు దేవుడు.. అని చెప్పడం అనేది లేనే లేదు. హిందూ మతం ఒక  తత్వం.. ఒక  జీవన శైలి.  సామాన్యుడికి అర్థం కావటానికి abstract విషయాలకి  ఒక  రూపాన్ని ఇచ్చి..వాటికి కథలు  అల్లి చెప్పేసరికి.. సామాన్యుడు అసలు విషయాన్ని మరిచి.. కథనే నిజముకోటం వల్ల  జరిగిన అనర్థం ఇది.
విద్య ని సరస్వతి అన్నారు..   సరస్వతి అనగానే..   కలువ పువ్వులో వీణ పట్టుకొని కూర్చునే అందమైన అమ్మాయి కాదు..  అది ఒక abstract  ఆలోచనకి  తెలిసి  తెలియక ఇచ్చిన  రూపం. దానికి విగ్రహాలు తాయారు చేసి అభిషేకిన్చగానే  విద్య రాదు. ఒక గౌరవభావం తో విద్య నేర్చుకోవాలని తాపత్రయ  పడితే విద్య వస్తుంది.సరస్వతి విగ్రహాన్ని అత్యంత భక్తిశ్రద్దలతో పూజించేవారు.. నేర్చుకునే  దగ్గర కోచ్చెసరికి అది చూపించరు. " విద్య "  దైవం అని చెప్పటం దీని అంతరార్థం.

లక్ష్మి అంటే సంపద కి చిన్హం . అది , ఐశ్వర్య  ధన, దాన్య, ధైర్య,సంతాన, రాజ్య,విజయ.... అష్ట లక్ష్మి లు సంపదలే. అంతే కాని తామర పువ్వులో కూర్చొని బంగారు నాణేలు రాల్చే అమ్మాయి కానే కాదు. కేవలం సంపద..ఏ  రూపంలో ఉన్నా సరే.ఆ సంపదని మనం గౌరవించాలి.
ఇలా చెప్పుకుంటూ పోతే సృష్టి,  స్థితి,  లయ కారకులు..అష్ట దిక్పాలకులు.. అందరు abstract నే. ఇలా మన దైనందిన జీవితంలో ఎదురయ్యే ప్రతిదాన్ని దైవంగా  పరిగణించటం హిందూ సంప్రదాయం. 

దేవుడు ఎవరయా అంటే..
" ఏదేవు దేహమున యిన్నియును జన్మించే.. ఏదేవుదేహమున యిన్నియును అణగెమరి,   ఏ దేవు విగ్రహంబీ సకల వింతయును.. ఏదేవు నేత్రంబులిన చంద్రులు ..
ఏ దేవు డీజీవులన్నింటి లో  నుండు.. ఏదేవు చైతన్య ఇన్నింటికాధారం  
మేదేవుడవ్యక్తు ....దేవుడద్వందు.. ఏ వేల్పు పాదయుగమిళయు నాకాశంబు .. ఏ వేల్పు  పాద కేశర్థంబనంతంబు ..

ఏ వేల్పు నిశ్వాస మీ మహా మారుతము   .....................
ఏ వేల్పు భువనైక హితమనో భావకుడు... -(అన్నమయ్య )



..అలాంటి వాడు ఎవడూ లేడు.. ఈ  సకల చరాచర ప్రకృతి, దాని తత్త్వం తప్ప.
చెట్టు, పుట్ట..జీవం,నిర్జీవం,చైతన్యం,
సమస్త సృష్టి... అంతా దైవమె. ఇదే హిందూ మతం చెప్పింది.
రామాయణ భారత భాగవతాలు, ఇతర పురాణాలు  అన్ని సామాన్యుడికి అసలు విషయం వివరించటానికి  చేసిన  ప్రయత్నాలు... వేదోపనిశాత్తుల్లో   ఉంది హిందుత్వం అంతా.
అది మరుగున పడేసి.. రామాయణ భారత  ముఖ్య  పాత్రలు ముందుకొచ్చాయి నేడు. రాముడు అనే పాత్ర ద్వార దైవ తత్వాన్ని భోదించటానికి ప్రయత్నించారు. కథలు,కావ్యాలు, పురాణాలు..వేదాలు కలగలిపి..కలగూరగంప చెసి..గందరగోళం చేసేసారు.
దేవుడిని  గూర్చి చెప్పిన ప్రతి వాడు దేవుడైపోయాడు  ఏదో రెండు మూడు చమత్కారాలు చేయగానే అతడిని .. అతని శ్లాఘిచి కీర్తించి..దేవుడిని చేసేసారు.దాంతోనే  ముక్తి దోర్కుతుందేమో అని  తపిస్తున్నారు. అది కేవలం భక్తి,  ప్రపత్తి లోంచి మానసికంగా వొచ్చే ఒకానొక రసానందం మాత్రమే. ఇంకా లోతైన ఆనందాన్ని చవి చూడాలి అంటే అంతర్ముఖులం  అయిపోవాలి. 

.జన్మని వృధా చేసుకుంటున్నారు.

ఆంధ్ర ప్రేదేశ్ ని పరిపాలించిన ప్రతి ప్రభుత్వం.. తెలంగాణా సమస్యని ఇంతదాకా రానిచింది..వెనకబడిన ప్రతి ప్రాంతాన్ని.. (అది తెలంగాణా కావొచ్చు..ఆంద్ర కావోచు రాయల సీమ కావొచ్చు..) అబివృద్ది చేసినట్టయితే... అభివృద్ధి అనగానే.,, ఏదో ఆకాశ హర్మలు కాదు.. ఆహరం ఆరోగ్యం..మంచినీరు ...విద్య, ఇలా మనిషి కనిస
అవసరాలు తీర్చగలిగి ఉంటె దేశం ( రాష్టం ) ఈ నాడు ఈ గతికి వొచ్చి ఉండేది కాదు. కాని.. మన నాయకులూ పదవీ వ్యామోహంతో..సుఖ బోగ లాలసులై.. తరతరాలకి తరగని ఆస్తులు కుడబెడుతూ.. మానవ సేవయే మాధవ సేవ అని మరిచి పోయి ప్రజలకి సేవ చేయగలిగే అపూర్వ అవకాశాన్ని వదులుకుంటూ ..జన్మని వృధా చేసుకుంటున్నారు.
మనిషికు ఉండలిసిన బేసిక్ లక్షణాలు కూడా లేని నాయకులే అందరూ . అంతరాత్మలు చచ్చిన మనుషులు వాళ్ళు.
మన ప్రభుత్వాలు  విద్య , ఆరోగ్యాన్ని కార్పోరేట్ పరం చేసి.. సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేసింది.
జనాభా పెరుగుదల ని పట్టిచుకునే నాథుడే లేడు.
దేశం capital of diabetics and aids గా మారుతుంటే అడిగే దిక్కు అంతకన్నా లేదు.
మత చందాసం ప్రభలుతోంటే .. terrorist లు దేశం లోకి చొరబడి జనాల్ని పిట్టల్ని కాల్చి నట్టు కాల్చుతుంటే.. సంసృతి పరిరక్షణ పేరుతో వ్యక్తి స్వేచని భంగపరుస్తోంటే.. ఎన్ని అని చెప్పేది...
భారత దేశము కర్మ భూమి...
.........నా కర్మ భూమి....
ఇదా నా భారత దేశం.???
(స్వయం పరివర్తన చెందని వాడు విశ్వాన్ని మార్చలేడు.)