Feb 21, 2014

.మనసుల దాకా వెళ్తామా ??


కాలం కరుగుతోంది.. జీవితం గడుస్తూ ఉంది..
నేను బిజీ అనుకొని నువ్వూ..నీవు బిజీ అనుకొని నేనూ..
నువ్వేమనుకుంటావో అని నేనూ..నేనేమనుకుంటానో అని నీవూ..
 ఈ కంపూటర్ తెర వెనక  మొహాలు చాటేసుకుకొని..
నేనేంటో నీకు తెలియక..నీవేంటో నాకు తెలియక
మాటలే కలవలేదు..మనసుల దాకా వెళ్తామా ??

నీ గుడ్మార్నింగ్ పోస్టులకీ కామేంట్లు పెడుతూ నేను..
నా కవితని కడగంట కూడా చూడకుండా నీవు..
నీవు పెట్టిన హీరోఇన్ల
పోటోలకి లైకులు కొడ్తూ నేను..
అచ్చంగా నా పోటో పెట్టినా పట్టించుకోని నీవూ..
ముఖ పుస్తకం కాదిది ముసుగు పుస్తకమై ..
ఉన్నావో లేవో తెలియని నీకై..నేనున్నానని నేనూ నా  ప్రొఫైల్ !!



కాలం కరుగుతోంది.. జీవితం గడుస్తూ ఉంది..