మా రమణ గాడు కలవక కలవక కలిసాడు.
చాయ్ చప్పరిస్తూ మాకంటే ఓ ఉద్యోగామంటూ లేదు .. నీకేమయ్యిన్దిరా చక్కగా సాఫ్ట్వేర్ జాబ్.. వెలగబెడుతున్నావ్ ..ముప్పై వేలకి పైగా సంపాదిస్తున్నావ్ నీకు పిల్ల దొరకటం లేదా.. లేక లవ్ లో పడి ఇంట్లో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నవా?? అని అడిగేశా
వాడు సమోసాని ఎలక కోరికినట్టు తన ముందు పళ్ళతో రెండుసార్లు కొరికి నమిలి మింగి గుక్కెడు నీళ్ళు తాగి చాయ్ ఓసారి చప్పరించి గాని సమాధానానికి ఉపక్రమించలేదు. ఇంత చేసాడంటే.. సమాధానం దీర్ఘమైయిందే అని అర్థమయ్యింది.
'ఉద్యోగం వచ్చి అరునేల్లె అయ్యింది కదరా.. అప్పటిదాకా నేను బికారినే కనక నా మొహం ఏ అమ్మాయి చూడలేదు. ఇప్పుడిప్పుడే చూస్తున్నారు. ఇహ మా ఆఫీసులో ఉన్న అమ్మాయిలని లవ్ చేసేంత దైర్యం నాకు లేదు. ఒకే ఆఫీసులో ఇలాంటి యవ్వారాలు నడిపితే రేపొద్దున ఏదన్న అయితే .. ఒకరిమోహాలు ఒకరు చూస్తూ ఉండలేము. అందుకే నో లవ్వు.'
అయినా నీకు సింపుల్ గర్ల్ కావలి అన్నావ్ కదరా.. దొరకటం కష్టం అవుతోందా ??
' మా మామగారు ఓ రెండు సంబంధాలు తెస్తే చూసాను,. మొన్నే.'
మరేమయింది..??
చెప్పనీ ...
మొదటి అమ్మాయి వసంత లక్ష్మి.. డిగ్రీ వరకే చదివింది.. ఆపై ఓ సంవత్సరం స్కూల్లో పనిచేసిన అనుభవం ఉంది.
మరింకేం నీవు కోరుకున్నట్టే.. సింపుల్ గర్ల్ అనుకుంటా...
అగు చెప్పనీ..
మా ఇద్దరినీ ఏకాంతంగా మాట్లాడుకోమని వదిలేసారు..
నేను పలకరింపు నవ్వు నవ్వాను.
ఆ పిల్లా నవ్వింది నేను కాఫీని జుర్రుతూ ఆ పిల్లని చూసాను...
హై హీల్ చెప్పులు.. గోర్లకి పాలిష్.. బంగారు పట్టీలు..లంగా హానీ లా ఉండే చీర..వడ్డానం,. చేతులకి అటు ఇటు బంగారు గాజుల మధ్యలో రెండు డజనుల గాజులు.. మెహందీ పెట్టిన చేతులు.. రాక్షసి లాగా పెంచిన గోళ్ళకి రక్తం రంగు పాలిష్.. మెళ్ళో నాలుగు రకాల నేక్లసులు.. చెవులకి పొడవాటి జూకాలు.. పాపిట బిల్లా .. పొడవాటి జడ, జడకి గంటలు...
మరింకేం రా ..లక్షణంగా లక్ష్మీ దేవి వస్తోంటే కాదన్నవా ??
నీ బొంద అవన్నీ నిజం బంగారం కాదు... నకిలీవి.
లేకపోతే నివు సంపాదించే బోడి ముప్పై వేలకి నిలివేల్లా నిజం బంగారం తొడిగి పెళ్లి చేస్తారా ??? సర్లే చెప్పు..
ఎలా వచ్చారు అంది.
కారులో అని చెప్పా
మీదేనా ?? అని అడిగింది..
కాదు కాబ్..
ఇల్లుందా ?
లేదు..
పోనీ లవ్వు చేసావా ఎవరినైనా ??
లేదు ఎవ్వరిని చేయలేదు.
పోనీ ట్రై చేసావా ??
య కొంతమందికి ట్రై చేశా..
మరి ఏమయ్యింది..
ఎవరు నన్ను లవ్వు చేయలేదు..
నిజంగానా ??
నిజంగానే లవ్వు గివ్వు ఏమీ లేదు..
ఓ కారు లేదు.. ఓ ఇల్లు లేదు.. నీ మొహాన్ని ఒకరు లవ్వు చేసిన పాపనా పోలేదు, ఎందుకు పనికి రాని నీ వెధవ పేస్ నాకు వద్దు. అని విసవిస వెళ్ళిపోయింది అక్కడినుంచి that సింపుల్ గర్ల్...
చాయ్ కూడా చివరి గుక్క తాగి కుప్పు పక్కన పెడుతూ ముగించాడు మావాడు.. ఈ పేస్ తో .
మరి రెండో సంబంధం...అత్రుతగా అడిగా
దానికి చాయ్ సరిపోదు బారు కి వెళ్దాం పదా అన్నాడు, ఇద్దరం లేచాం.