Apr 9, 2013


చెమట కార్చటం నుంచి తప్పించుకోవాలి ఎలాగయినా....
ఇన్సులిన్ సూది గుచ్చుకుంటా ..కాని ఇటున్న సూది అటు పెట్టలేను..
వడి వడిగా నాలుగు అడుగులు వేయలేను, ______కిందికి బండి కావలి..
ఓ గంట మౌనంగా ఆలోచించలేను... చెవుల్లో బీట్ వినిపించాల్సిందే..
ఉషోదయం..సుబ్బలక్ష్మి గారి సుప్రభాతం... ఎవరిక్కావాలి??...టీవీ లో స్కాములు ..స్కాన్డల్స్ పెట్టు...
పదినిముషాలు నడకా ...అక్కర్లేదు న్యూస్ పేపర్ లో చావు వార్తలు చదువుతా!
ఆఫీసుకు వెళ్ళాలి బాక్స్ సర్ది చచ్చావా...
వారమంతా తెలియని అంకెల్లో అక్షరాలతో కంప్యూటర్ లో కు
స్తీ పట్టి,
వారాంతం .. విద్యుద్దీపాల వెలుగులో ..వెలుగులేని మొహాల మధ్య.. 

ఓ పుచ్చు తెలుగు సినిమా, ఆపై ఇంపోర్టెడ్ విస్కీ గొంతు దించి.. రంగేసిన పెదాల రుచిని.. రెండు నిముషాల సుఖాన్ని పిండుకొని..
ఇంశ్టాల్మేంట్ అపార్ట్మెంట్లో అడ్డంగా పడి పోయి...

సుఖించానా లేదా...????

Apr 8, 2013



చల్లగాలి తగిలితే ఎందుకు మనసుకు హాయిగా ఉంటుంది ??
వానపడితే ఎందుకు తడవాలనిపిస్తుంది ??
కోయిల పాట ఎందుకు వినాలనిపిస్తది ??
పువ్వుల పరిమళం ఎందుకు చూడాలనిపిస్తూంది ??
 అహార పదార్థాలని చూస్తే నోరెందుకు ఊరుతుంది ??అవి 'ఎందుకో' నీకు తెలిస్తే.. నిన్ను 'ఎందుకు' ప్రేమించాలనిపిస్తూందొ నెను చెపుతా !!