Jan 26, 2013

మనకి మనమే ..




హ్యారీ పాటర్ - 3
హ్యారీ పాటర్ సిరస్ ని కాపాడే ప్రయత్నం లొ ఉన్నాడు. సిరస్ కొలను ఒడ్డున చఛిపొతున్నాడు. డెమన్స్ చుట్టూ చేరాయి. ఇద్దరి జీవ శక్థులని పీల్చేస్తున్నాయి. హ్యారీ శక్తి హీనుడు అవుతున్నాడు.డెమన్స్ మాత్రం తమని వదలటం లేదు. సిరన్ నిస్సహాయంగా పడున్నాడు. నిస్సహాయతే వాటికి కావలసింది. ఇంకో కొన్ని క్షణాల్లో సిరస్ ప్రాణాలు పోతాయనగా హ్యారీ దీనంగా చావుబతుకుల మధ్య కొలను అవతలి వైపు చూసాడు అటు వైపు ఒక తెల్లని కాంతిపుంజం కనపడింది. ఆ కాంతి పుంజం అంతకంతకూ ఎక్కువయ్యి మొత్తం డెమన్స్ ని పారిపొయెలా చెసింది. లేచి చూస్తే హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. అసలేమి జరిగిందో గుర్తులేదు.పక్కన హర్మోయిని ఉంది నవ్వుతూ.
ప్రొఫెసర్ డంబెల్డొర్ వచ్చాడు. గడిచిన కాలంలో జరిగిన తప్పు సవరించటానికి ఇద్దరినీ గత కాలంలోకి పంపాడు. ఇద్దరూ అన్నింటినీ సవరిస్తూ .. సిరస్, హ్యారీ పాటర్ డెమన్స్ బారిన పడె దశకి వచ్చారు. అటువైపు సిరస్ కొలను ఒడ్డున చఛిపొతున్నాడు. హ్యారీ పాటర్ నిస్సహాయంగా చాస్తూఉన్నాడు. డెమన్స్ చుట్టూ చేరాయి. సిరస్..హ్యారీ జీవ శక్థులని పీల్చేస్తున్నాయి. హ్యరీ అంతకంతకూ శక్తి హీనుడు అవుతున్నాడు. ఇటువైపు ఇక్కడ హ్యారీ పాటర్ తనకి కాపాడే వాళ్ళకోసం చూస్తున్నాడు. చనిపోతున్న తనని కాపాడింది తన తల్లిదండ్రులే అని అతడు అనుకుంటున్నాడు. కనక వాళ్ళొచ్చి హ్యారీని ( తనని ) రక్షిస్తారని చూస్తున్నాడు. సిరస్ ప్రాణాలు మెల్లిగా గాల్లొకలిసి పోతున్నాయి. తన తల్లిదండ్రుల జాడలేదు. తాను కూడా కొలను ఒడ్డున ప్రాణాలు పోగొట్టు కునే దశలో ఉన్నాడు. సిరస్ ప్రాణాలు ఇంకో క్షణం అనంతవాయువుల్లో కలిసిపోతాయనగా ఇహ లాభంలేదని, ఇటు వైపున ఉన్న హ్యారీ తానే తన మంత్రదండాన్ని ప్రయోగించి డెమన్స్ ని పారద్రోలి హ్యారీ ని కాపాడాడు. అంటే సిరస్ ని.. తనని తాను కాపాడుకున్నాడు.
అంతా అయోమయంగా ఉండవచ్చు. సినిమా చూసిన వాళ్ళకి బాగా అర్థం అవుతుంది. ఇంతకీ దీనిలో ఉన్న గొప్పదనమ్ ఎంటి అంటే , రచయిత్రి రోజు వారీ విషయాలకి చక్కని రూపకల్పన చేసి గొప్ప కథని తయారు చెసింది. అది కాల్పనికత అద్బుతంగా తెరెకెక్కించ బడింది. విశయానికి వస్తె....
ఆ డెమన్స్ ఎవరో కాదు... మన అత్మన్యూనత, అలసత్వం, నిరాశ, భయం, దిగులు, ఆందోళన, పిరికితనం. సమస్యలు మొదలైనవి. ఎప్పుడయితే మనం ఆత్మవిస్వాసాన్ని, దైర్యాన్ని,ఆశని కొల్పొతామో అవన్నీ మన మీద పడి దాడి చేసి మన శక్తులని పీల్చి మనని ఓటమి అంచున నిలబెట్టి చావుదశకి తీసుకెళతాయి. మనని ఎవరూ కాపాడలేరు. చివరికి మనని కనిపెంచిన తల్లిదండ్రులు కూడా. ఏ దేవుడూ రాడు మనకోసం.
మరి అటువంటి పరిస్థితుల్లో ఎవరయా మనకి దిక్కు ?? ఎవరయా మనని కాపేడేది?? ఎవరయా మనకి సహాయం చేసెది..చేయగలిగేది అంటే .. 'మనకి మనమే .. మన ఆత్మవిశ్వాసమే'
ఆత్మవిశ్వాసపు మంత్రదండాన్ని ప్రయోగిస్తే .. ఆ డెమన్స్ అన్నీ తలో దిక్కూ పారిపోతాయి. ఎంతకాలం అయితే మనలో మనమీద మనకి విశ్వాసం ఉంటుందో అంతకాలం అవేవీ మన దరికి రావు.
అదీ ఈ ఎపిసోడ్ లో మనం గ్రహించవలసింది.

ఇంత దరిద్రం... థు.

ఈ చట్ట సభల్లో ఒకరి పార్టిని..ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ..వాకౌట్లు గుర్రు పెట్టటాలు..తప్ప మారుతున్న కాల పరిస్థితులు విసిరే సవాల్లని ఎదుర్కొని troubleshooting చేస్తూ చట్టాలు సవరించి ఉండి ఉంటె
ఈ రోజు దేశం ఇంత దరిద్రంగా ఉండకపోయేది. పెరుగుతున్న జనాభాని నియంత్రించే వాడు లేడు... రగులుకుంటున్న మత విద్వేషాన్ని చల్లార్చే దిక్కు లేదు... పెడదారి పడుతున్న యువతకి దారి చూపే నాథుడే లేడు .
ఆ కాపిటలిస్ట్ లతో కలిసి దేశాన్ని దోచుకోవటం, దాచుకోవటం, ( దోచుకు తినటం కుడా కాదు.ఎందుకంటే తినే యోగ్యతా...యోగం కుడా ఉండదు )
ఉంది కదా అని ప్రజల మీద ధురాధికారం చూపించటం తప్ప..చూపించే అధికారం వలన తన ప్రజలు సుఖపడుతున్నారా, చల్లగా ఉన్నారా అనేకంపాషన్ లేని దొంగ ____ లా కనపడుతుంటారు మనం ఎన్నుకున్న చట్ట సభల్లో కూర్చున్న పెద్దలు.
ఒక్కో సమస్య మీద ఒక్కో సభ్యుడు తన నివేదిక సమర్పించి.. సూచనలు పరిష్కారాలు చేసినపుడు దాన్ని సరిచూసి..మెజారిటి సభ్యులు ఎంచుకున్న దాన్ని చట్టంగా పెట్టటానికి ... నా బొంద, ఇంత రాద్దాంతం.. ఇంత నాటకాలు ..ఇంత సమయం.. ఇంత ఆర్భాటం..ఇంత లేకి తనం..ఇంత దరిద్రం... థు.

....అదీ ప్రేమ.


ప్రయాణంలొ మొదట వేసెది అడుగు.. చివరన చేరేది గమ్యం.
ఆటలో మొదట్లొ వచ్చేది పాయింట్.. చివరన వచ్చెది గెలుపు.
యవ్వనం మొదట్లొనే అనిపింఛేది ఆకర్షణ ... చివరన కలిగే అనుభూతి ప్రేమ.
ఒకరినొకరు అర్థం చేసుకొని ..అన్ని ఒడుదుడుకులని సహించి.. జీవిత ప్రయాణం సాగించి ..సుఖ దఖాలని అనుభవించి ఇంకా ఒకరిమీద ఒకరికి అదే ఆకర్షణ గౌరవం కలిగిఉంటే, మిగిలి ఉంటే... అదీ ప్రేమ.

ఊరికే మొదట్లోనే ప్రేమించాను అనకండి.. ప్రేమ మొదలు పెట్టాను అనండి... చివరిదాకా నిలబడండి.. అప్పుడు చెప్పండి ప్రేమించాను అని.




సగటు భారతీయ స్త్రీ..

  
 మాట్లాడితే సగటు భారతీయ స్త్రీ అంటుంటారు. నాకు మాత్రం సమాజంలో చాలా మంది స్త్రీలు కనపడుతున్నారు.
బికినీలలో... అంగాంగ ప్రదర్శనలో...అష్టాదశ చుం
బనాలలో జీవించేసే మన నటీమణులా ???

నడుముని నాగుపాములా తిప్పే ఐటెం గాళ్స్ ఆ ??
పబ్బుల్లో మినీ లంగాల్లో తాగి ఊగె పిల్లా ??
వంటిల్లు తప్ప లోకమే తెలియని ఓ ముసలి తల్లా ??
బ్రతుకు పోరులో పొద్దునే వెళ్లి , ఏ సాయంత్రానికో క్రష్ నుండి చంటాడిని చంకనేసుకొచ్చి వంట చేసి పెట్టె సగటు మధ్యతరగతి స్త్రీ యా ??
టీవీ సీరియళ్ళ ముందు కంటనీరు పెట్టె ఇల్లాలా ??
కూలీ డబ్బులు ఇచ్చేసి తాగి తంతే మూల కూర్చొని ఏడిచే పెళ్ళామా ??
మొగుడికి చద్ది తీసుకొచ్చి పొలంలో నాట్లు వేసే పల్లె పడుచా ??
మాసిన జుట్టుతో, ముక్కుకారే పిల్లాడిని ఎత్తుకొని x రోడ్డులో అడుక్కునే బిచ్చగత్తెనా ??
జీన్సుల్లో కాలేజీకేల్లి బాయ్ఫ్రెండ్ తో కబుర్లాడుతూ, చదువు 'కొనే ' అమ్మాయా..
పుట్టిన పాపానికి చెత్తకుప్పలో విసిరి వేయబడ్డ చంటిదా !
ఇందులో ఎవరు భారతీయ స్త్రీ ??? ....I am so confused .

అదీ సమస్య.


అక్కడ వివిధ దేశాలు సుఖమయ జీవితానికి అవసరమయిన ఒక్కో అవిష్కరణనీ చేసుకుంటూ వేళుతోంటే ఆ సాంకేతికత నీ, వస్తువులనీ దిగుమతి చేసుకొని అనుభవిస్తూ ఆనందిస్తూ, పనేమీ లేక సుఖంగా పిల్లనని కంటూ.. మళ్ళీ విదేశీ సంకృతి అని వాటిని దెప్పి పొడవటం. అవేం మన దేశం మీద పడి సంస్కృతిని మార్చయా ?? లేక మనమే వాటిని అనుసరిస్తున్నామా ??అనుసరిస్తే ఎందువల్ల అనే ఆలోచన కూడా లేదు.

ఈ జీవితాన్ని అవగాహన చేసుకొని, విపత్తులని ధైర్యంగా ఎదురుకొని.. సుఖమయ జీవితానికి కావలసిన సాంకేతికత, వస్తు సామగ్రి తయ్యారు చేసుకొనే తెలివి లేక.. పరలోకంలో ఏదో ఏడిచిందనీ .. ఇక్కడికంటే అక్కడేదో బావుంటుందనీ నమ్మబలికి, బద్దకస్తులై, కనిపించని దేవుడిని ఆరాధిస్తూ..ఏ మాత్రం దేవుడు..స్వర్గం..మోక్షం అనే మాటలు మాట్లాడినా వాడికి దైవత్వం ఆపాదిస్తూ.. కనిపించిన నదుల్లో మునుగుతూ, తేలుతూ ఏదో పుణ్యలోకం ప్రాప్తిస్తుందనే భ్రాంతిలో బతుకుతూ మళ్ళీ దానికో పేరు.
పొనీ గొప్పదనుకుంటున్న సంకృతిని కాపాడుకునే శక్తీ ..ప్రణాలికలు కుడా లేవు. కాని ఉరికే ఏడుపోకటి.


ఆధ్యాత్మికత వ్యక్తిమనోగతం. ( దేవుడు అన్నారుగా, దానికి సంభందించింది.) సంస్కృతి జీవన విధానానికి (సామాజికం) సంభందించింది, అది బహిర్ముఖంగా మారుతుంది. ధర్మం, వ్యక్తి సామాజిక ప్రవర్థన కి సమాజానికి మధ్య నిలిచె అంతస్సూత్రం. మూడింటినీ కలపొద్దు. 
 ఆధ్యాత్మికతకీ.. సంస్కృతికీ .. పురాణాలకీ ..పిట్టకథలకీ.. మానసిక ఆనందం ఇచ్చే పనులకీ తేడా తెలియదు. అన్నింటినీ కలిపి ముడులు వెసుకుంటారు.. దాన్ని విప్పి దెనికదిగా చూడరు. చూచినా అర్థం కాదు. అదీ సమస్య.