ఎరా పెళ్లి ఎప్పుడు ? చేసుకోవా ?? అని అడిగా ఒక మిత్రుడిని..
అందము ప్రాయము ఐశ్వర్యము గల సుందరి దొరకుటె అరుదు కదా.
ఆమె మనని వరించుట కలయే కదా.. ఆది నిజమవదు కదా.. అని సెలవిచ్చాడు.
అరేయ్ మొహం చూసుకున్నావా అద్దంలో అని అడిగా..
" ఉంగరాల జుట్టు వాణ్ణి ..ఒడ్డు పొడుగు ఉన్నవాణ్ణి..
చదువు సంధ్య గల్గినోన్ని చౌక బేరమా ?? అన్నాడు.
అన్ని బానే ఉన్నాయ్ కాని ఒక్క సారి బ్యాంకు బాలన్సు చెప్పరా అన్నాను.
ప్రేమ ఆస్థి అంతస్తులు చూడదు అన్నాడు.
కాని ప్రేమించే పిల్ల చూస్తుంది, ప్రేమించినప్పుడు చూడకున్నా పెళ్లి చేసుకుందాం అనగానే చూస్తుంది.
ఒక విధమైన భ్రమలో పెళ్లి జరిగినా పెళ్లి అయ్యాక చూస్తుంది.
ఒంటరి జీవితానికి ఏది ఉన్నా లేకపోయినా ఫరవాలేదేమో కాని జంట అయితే మాత్రం జీవితంలో ఎప్పటికయినా బ్యాంకు బాలన్సు/ డబ్బు ముఖ్యం రా బాబు అన్నాను.
మా వాడు బిక్క మొహం వేసి.. అంతే అంటావా అన్నాడు.
ముమ్మాటికి అంతే..... అని ఫినిష్ చేశాను నాలుగో పెగ్గు .