Aug 7, 2012

ప్రతిక్షణం మరణిస్తాను..


పచ్చగా కళ కళ లాడుతూ ఉగే కొమ్మలని చూసి మురిసి పోతాను..
మొగ్గలోంచి తొంగి చూసే పువ్వుని చూసి ఆశ్చర్య పడతాను ..
నిటారుగా నిలచిన వృక్షాల గంభీర్యానికి బిత్తర పోతాను..
కిల కిలా ఎగిరే పక్షుల స్వేచ్చకి ఈర్ష పడతాను.
ఆకాశంలో తేలే మబ్బులని చూసి అబ్బుర పడతాను..
నింగి నించి రాలే చినుకులని చూసి చిందులేస్తాను..
గడ్డి పరకలపై వాలిన మంచుబిందువులని చూసి ముచ్చట పడతాను..
కార్తీకపు చలిలో నెచ్చెలి వెచ్చదనం వెతుక్కుంటాను..
రాలుతున్న ఆకుల్లో విశ్వ రహస్యాన్ని ఆలోచిస్తాను..
వేసవి ఉదయాల్లో కోయిల రాగాలు ఆలకిస్తాను..
తొలికరి జల్లులో పుడమినై పులకరిస్తాను..
ప్రతి రోజు ప్రకృతికాంత వొడిలో పరవశిస్తాను.
విశ్వ సౌందర్యదీపపు వెలుగులో శలభాన్నై ప్రతిక్షణం మరణిస్తాను.