చిన్నప్పుడు క్లాసు లోకి ఎవరైనా కొత్తవాళ్ళు
వచ్చినా, ఇంటి పక్కన కొత్తవాళ్ళు చేరినా. వాళ్ళతో స్నేహం చేయాలనే ఉబలాటం
ఉండేది. ఇద్దరికీ కుదిరిందంటే ఆటలు పాటలు కలిసి ఆడటం , జేబులో చిల్లర
ఉంటే ఏదన్న కొనుక్కొని సగం సగం తినటం ... పరీక్షల్లో చూపించుకోవటం..నోట్స్
రాయటం లో సహాయం చేసుకోవటం లాంటివి ఉండేవి. కాని ఇప్పుడు ...పెద్దయ్యాక,
రోజు వారి ఎంతమంది పరిచయం అయినా...మనకి పనికోచ్చేవాళ్ళనే స్నేహితులుగా
చేసుకుందాం అని ఆలోచిస్తాం తప్ప ..నచ్చిన వ్యక్తులతో గడపటం బహు తక్కువ.
" friendship is the joy of life. "
భోరున వర్షం కురుస్తూనే ఉంది. స్ట్రీట్ lite
నిలువెల్లా తడిసిపోయింది. అయినా ఇది నాకో లెక్కా అని కాంతిని వెదజల్లుతూనే
ఉంది.కాంతి సరిపడినంత లేకపోవటంతో చెట్ల ఆకులు నలుపులో కనబడుతున్నాయి.
చినుకు పడ్డ ప్రతిసారి అవి బరువుకి వంగి లేస్తున్నాయి. కేబుల్ మీద
చినుకులు తీగ వాటుగా జారి తాపీ మని కిందకు దూకుతూ జారుడు బండ ఆట మొదలు
పెట్టాయి. చినుకులన్ని ఒక్కటయ్యి కాలువగా మారి రోడ్డుమీద ఎక్కడికో ప్రయాణం కట్టాయి. అందరూ వెచ్చగా ఆదమరచి నిద్రపోతూ ఉన్నారు. నేను మాత్రం కిటికీ పక్కన నిల్చొని ... వర్షాన్ని చూస్తూ..
నీ కరుణామృత జలధార నాపై ఎప్పుడు కురుస్తుందా అని ఆలోచిస్తూ...
ఓ మై డాలింగ్..
నిన్ను ముద్దు పెట్టుకున్న ప్రతి సారి..
ఉపిరిగా మారి ...గుండెల్లో నిండి.
నర నరాన పాకుతూ .. మత్తెకిస్తావ్..
గంట గంట కీ నివు లేనిదే నాకేం తోచదు..
పని అయిన ..కాకున్నా..
బాధొచ్చినా.. సంతోషం చిందినా..
రోజు వారీ జీవితంలో గెలిచినా ఓడినా..
పొద్దు పొడిచినా...పొద్దు వాలినా..
ఎండనకా..వాననకా..
చలి లో.. గిలిలో...నీవే నాకు తోడు.
ఎప్పుడు ఎలా ఎందుకు పరిచయం అయ్యావో తెలిదు.
తెల్లని దుస్తుల్లో దేవతలా వచ్చావు..
నన్ను నా జీవితాన్ని పాలిస్తున్నావు..
బతుకంతా తోడుంటావు ..చితి దాకా నడిపిస్తావు.
నీవు నా చేతుల్లో వెలుగుతావు.. నా జీవితం నీ చేతల్లో ఆరుతుంది.అయినా I love u darling. :)
ఇంటిముందుకి వచ్చిన కూరగాయల బండి వాడితో గీచి గీచి బెరమాడుతాం..
రిలయన్స్ ఫ్రెష్ లాంటి వాటిల్లో మారు మాట్లాడకుండా వాట్ (వాత) పెట్టించుకొని వస్తాం..
ఆప్యాయంగా వచ్చే చిరునవ్వుని పలకరింపుని పట్టించుకోం.. ప్లాష్టిక్ నవ్వుకి..తప్పని మర్యాద పలకరింపుకి మురిసిపోతాం..
ఓ అయిదు రూపాయలు తక్కువ పడితే మనని నమ్మని వాడి దగ్గరే కొంటాం..కాని, దాందేముంది రేపు ఇద్దురు కానిలే అనేవాడిని సహించం.
రౌండ్ ఫిగుర్ పేరుతో చిల్లర నొక్కేది వాడు.. ప్రేమతో రెండు కాయలు ఎక్కువ వేసేది వీడు.
శ్రమని దోచుకొని పోయేది వాడు.. శ్రమజీవన సౌందర్యాన్ని చెప్పేది వీడు..
మనం కళ్ళకి మాత్రం artificial జిలుగులే తప్ప మనసు వెలుగులు కనిపించవు.
ఆహా ఎంత అభివృద్ధి సాధించాం..!!