Apr 29, 2012

మనిషిగా మిగిలిపో..



 
సరే.. దోచుకున్నావు. వేల కోట్లు దోచుకున్నావ్ ?? ఆ కాగితపు కట్టలు నీ పేరుమీద దాచుకున్నావ్. ఎకరాలకి ఎకరాలు నీ పేరుమీద ఉందని మురిసిపోతావ్ .. కాని ఏం లాభం ?? చెప్పు ?

చెయ్యి ..ఎంజాయ్ చెయ్యి.. ఎంత చేయగలిగితే అంత చెయ్యి. తెలివితో సంపాదిన్చుకు
న్నావ్ కనక చెయ్యి. కాని

ఆ చేత్తోనే... కలలో కుడా ఇలాంటి అదృష్టం / అనుభవం వస్తుందని అనుకోని ఒకడికి ఒక గొప్ప అనుభవాన్ని/అదృష్టాన్ని ఇచ్చి చూడు. పొంగి పోయే వాడి గుండె ని చూడు. వాడి కళ్ళలో ఆనందం చూడు. వాడు కృతజ్ఞతతో రెండు చేతులుఎత్తి చేసే నమస్కారం చూడు. మనుషుల మనస్సులో దాగిన ప్రేమని చూడు. దాన్ని సంపాదించుకున్న నీవు ఎంత గోప్ప వాడివో నీకు అర్థం అవుతుంది.

ఈ దేశంలో

రెండు పూటలా అన్నం.. తనకంటూ ఓ చిన్న గూడు ఇవీ మహత్తర అదృష్టంగా భావించే వాళ్ళు కోకొల్లలు.
శుబ్రమయిన మంచి నీళ్ళు దొరికితే చాలు అనుకునే ఉర్లు కోకొల్లలు..
చదువుకోటానికి తమ పిల్లలకి బడి దొరికితే చాలు అనుకునే వాళ్ళు కోకొల్లలు..
తమ ఉరికి బస్సొస్తే చాలు అనుకునే వాళ్ళు కోకొల్లలు.
తమ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం బాగాయితే చాలు అనుకునే వాళ్ళు కోకొల్లలు.
దిక్కు లేక ..రోడ్డున పది వెట్టి చాకిరీ చేస్తూ బాల్యాన్ని కోల్పోతున్న పసివాళ్ళు కోకొల్లలు..
వీళ్ళ0తా నీ కోసం.. నీ అభయ హస్తం కోసం...నీ సాయం కోసం ఎదురు చూస్తున్నారు...
కళ్ళు తెరువు. వాళ్ళని చూడు. నీది కాని నీ సంపదని.. వాళ్ళ సంపదని వాళ్ళకి ఇచ్చేసి మనిషిగా మిగిలిపో.. దేవుడిగా వెలిగిపో.

4 comments:

Padmarpita said...

ఒక్కరైనా మారి మనిషిగా మిగిలిపోతారా???
Good one...worth to read.

జ్యోతిర్మయి said...

అన్యాయాన్ని ఎదిరించే స్థాయినుండి బతిమాలుకునే దగ్గరకు వచ్చామన్నమాట.

anrd said...

చాలా చక్కగా వ్రాసారండి.

ఇతరులను దోచి సంపాదించిన వాళ్ళకి చివరికి మిగిలేది అందరి తిట్లూ, శాపనార్ధాలు. చేసిన పాపాలకు భవిష్యత్తులో పడే శిక్ష.

సొంతలాభం కొంత మానుకుని ఇంకొకరికి సాయం చేస్తే కలిగే తృప్తి మాటల్లో వర్ణించలేనిది.

anrd said...
This comment has been removed by the author.