Apr 29, 2012

మనిషిగా మిగిలిపో..



 
సరే.. దోచుకున్నావు. వేల కోట్లు దోచుకున్నావ్ ?? ఆ కాగితపు కట్టలు నీ పేరుమీద దాచుకున్నావ్. ఎకరాలకి ఎకరాలు నీ పేరుమీద ఉందని మురిసిపోతావ్ .. కాని ఏం లాభం ?? చెప్పు ?

చెయ్యి ..ఎంజాయ్ చెయ్యి.. ఎంత చేయగలిగితే అంత చెయ్యి. తెలివితో సంపాదిన్చుకు
న్నావ్ కనక చెయ్యి. కాని

ఆ చేత్తోనే... కలలో కుడా ఇలాంటి అదృష్టం / అనుభవం వస్తుందని అనుకోని ఒకడికి ఒక గొప్ప అనుభవాన్ని/అదృష్టాన్ని ఇచ్చి చూడు. పొంగి పోయే వాడి గుండె ని చూడు. వాడి కళ్ళలో ఆనందం చూడు. వాడు కృతజ్ఞతతో రెండు చేతులుఎత్తి చేసే నమస్కారం చూడు. మనుషుల మనస్సులో దాగిన ప్రేమని చూడు. దాన్ని సంపాదించుకున్న నీవు ఎంత గోప్ప వాడివో నీకు అర్థం అవుతుంది.

ఈ దేశంలో

రెండు పూటలా అన్నం.. తనకంటూ ఓ చిన్న గూడు ఇవీ మహత్తర అదృష్టంగా భావించే వాళ్ళు కోకొల్లలు.
శుబ్రమయిన మంచి నీళ్ళు దొరికితే చాలు అనుకునే ఉర్లు కోకొల్లలు..
చదువుకోటానికి తమ పిల్లలకి బడి దొరికితే చాలు అనుకునే వాళ్ళు కోకొల్లలు..
తమ ఉరికి బస్సొస్తే చాలు అనుకునే వాళ్ళు కోకొల్లలు.
తమ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం బాగాయితే చాలు అనుకునే వాళ్ళు కోకొల్లలు.
దిక్కు లేక ..రోడ్డున పది వెట్టి చాకిరీ చేస్తూ బాల్యాన్ని కోల్పోతున్న పసివాళ్ళు కోకొల్లలు..
వీళ్ళ0తా నీ కోసం.. నీ అభయ హస్తం కోసం...నీ సాయం కోసం ఎదురు చూస్తున్నారు...
కళ్ళు తెరువు. వాళ్ళని చూడు. నీది కాని నీ సంపదని.. వాళ్ళ సంపదని వాళ్ళకి ఇచ్చేసి మనిషిగా మిగిలిపో.. దేవుడిగా వెలిగిపో.

Apr 3, 2012

ఇదీ మన మధ్య తరగతి ...



ఏదో చేయాలని ఉబలాటం ... ఏమీ చేయలేని చేతగాని తనం
గొప్ప సాధించాలని తాపత్రయం.. చప్పగా సాగే రోజువారీ
తెగించి పట్టుకోలేరు...ధైర్యం చేసి వదలలేరు
ఆరాటం ఎక్కువ ...ఆలోచన తక్కువ ..
అనవసర సెంటిమెంట్స్.. అర్థం లేని ఆచారాలు..
టీవీల్లో ప్రపంచాన్ని చూసి బాధపడతారు ..ఆ బాధమీదే వాడు డబ్బు సంపాదిస్తాడని తెలుసుకోలేరు.
ఎవడో చెప్పిన నీతులు పాటిస్తారు.. అవి చెప్పేవాడు అవసరానికి గోతులు తవ్వుతాడని అర్థం కాదు.
మంచి గా ఉండాలనే ప్రయత్నం ..ఉండలేక అంతులేని వేదన
దేవుడు కాపాడతాడని పూజలు...వాటిల్లో సగం జీతం హారతి ..
చివరికి కులం చెడగొట్టు కుంటారు కాని సుఖం దక్కించుకోలేరు..
ఎవరో వస్తారని,,ఏదో చేస్తారని...ఆశపడుతూ ..ఆశలోనే బతుకీడుస్తూ..
ముక్కుతూ మూలుగుతారు .. చస్తూ బతుకుతారు.

ఇదీ మన మధ్య తరగతి మనుషుల గతి.
ఇదీ మన భారతం ..