Jan 17, 2012

 కేవలం కలల్లో బ్రతికితే జీవితం కాదు. కేవలం నమ్మకాలతో గెలుపు రాదు. హేతువాద దృష్టి అంటే నాస్తికత్వం కాదు.
దేవుడు ఉన్నాడా లేదా అన్నా ప్రశ్న కంటే .. మన పురాణాల్లో ప్రేవేశపెట్టిన దేవుడిని హేతు బద్దంగా తర్కించి మూడత్వాన్ని కడిగేయటం. వాటి స్థానే కొత్త నమ్మకాలని పునః ప్రతిష్టించు కోవటం. మతాన్ని మట్టు బెట్టి మానవత్వాన్ని స్థాపించటం.
కొన్నింటిని ప్రశ్నించాలి.. తర్కించాలి .. ..విభేదించాలి...ఎదురించాలి.. ఖండించాలి .. అప్పుడే అర్థం లేని సనాతనత్వానికి తిలోదకాలిచ్చి నూతనత్వానికి తెర ఎత్తగలం.

Jan 6, 2012

హాయ్
How are U.??
fine ..U ?
బావున్నాను..
ఏమిటి సంగతులు..
చెప్పాలి.
మీరు బాగా రాస్తారు..
అవునా..ఏదో అలా..
ఆలోచించేట్టు ఉంటాయి..
ఏమో..తెలిదు..నాకు ఆ క్షణం లో అనిపించింది  రాస్తుంటా.
ఒకే... అవును  మీ మొబైల్ ఏంటి ??
నోకియా..
అదే నోకియాలో... ఏ మోడల్..
అదా  1100 అనుకుంటా..
ఒకే.. హే నేను తరవాత ఫోన్ చేస్తా..
ఏం..?
కొంచం పనుంది.. మళ్ళీ చేస్తా...బాయ్
ఆది కా....
ఫోన్ కట్ అయ్యింది...  మళ్ళీ ఫోన్ రాదనీ మీకు తెలుసనుకుంటాను.