యే దునియా . ఎక్ దుల్హన్...యే దునియా ఎక్ దుల్హన్. దుల్హన్ మాతే కి
బిందియా.. యే మేరా ఇండియా...యే మేరా ఇండియా.. పాడుకోవటానికి బావుంటుంది.
కాని ....
భారత దేశం.. నూటా ఇరవై కోట్లమంది ...అందులో కనీసం సగం మంది యువత
ఉంటారనుకుంటే... పద్నాలుగు నుంచి యవ్వనపు రక్తం కొత్తదారుల్లో
ఉరకలేస్తుంటే, లైంగిక వాంచని తొక్కి పెట్టిన మన సంస్కృతి సంప్రదాయాలు ఒక
పక్క, ఇంటర్నెట్ లో పచ్చి శృంగారం మరోపక్క, వయాగ్రాలకంటే ఎక్కువ కిక్కు
ఇచ్చే సినిమాలు, హిరోయిన్లు మరోవైపు, ఎందుకో తెలీక,చెప్పెనాథుడు లేక,
చెప్పుకోలేక, అడగలేక, ఆగలేక, ఆపుకోలేక ఆ యువత ఏం చేస్తుంది ? అడపా, దడపా హద్దు దాటుతుంది.
ఆడ
అయినా మగయినా ఈ దేశంలో, శృంగారం కావాలంటే, పెళ్లి చేసుకోవాల్సిందే.పెళ్లి
అయ్యాక, కొంతకాలం గడిచాక కాని తెలిదు అసలు విషయం. అప్పుడు విడివడలేక , కలిసి
ఉండలేక నరకం. ఆ నరకం లోంచి కోపం, క్రోధం.. దాంతో ఏదో మిషతో ఒకరినొకరు శారీరక,
మానసిక హింస పెట్టుకోవటం.ఇది ఇంకోరకం బాధ.
అయితే దరిద్రం, లేదా అత్యాశ వల్ల ...
కష్టపడకుండా మామగారు ముద్దుగా ఇచ్చే , పెళ్ళాం తెరగా తెచ్చేకట్నం. కట్నం
డబ్బులు కరిగి పోగానే ..పెళ్ళాం మీద మోజు తీరుతుంది. 'కుక్కని కొట్టినా
డబ్బులొస్తాయి' అన్న విషయం గుర్తొచ్చి పెళ్ళాన్ని
కొడతాడు.
ఇలా ఏ సందర్బంలో అయినా బాధ పడేదీ, నష్టపోయేదీ ... సున్నిత మనస్సు కలిగి, ఎక్కువ emotional
అయిన స్త్రీ యే.
బాగా ఆలోచిస్తే.. ఇక్కడ ఈ దేశంలో ప్రభుత్వానికి ప్రజల మీద
కంట్రోల్ లేదు..గౌరవం లేదు. పట్టింపు లేదు. ఇష్టం లేదు...బాధ్యత లేదు. దేశ భవిష్యత్తు మీద అవగాహన లేదు.
అలాగే ప్రజకీ కుడా ప్రబుత్వం మీద ఏదీ లేదు. వెరసి ఇదీ మనదేశం. ఇదీ మన ప్రగతి.
ఇదీ మన భవిష్యత్తు.
యదా రాజా... తథా ప్రజా .