Feb 23, 2010
నాలో నేను.
నాలో నేను.... ఇది నా మనసులో జరిగే ఆలోచనలు, ఆనందాలు, బాధలు, భయాలు, ఆందోళనలు, అల్లకల్లోలాలు,.సమాజం-నా అబిప్రాయాలు. కల్పిత కథలు, నిజ జీవితానికి కల్పన జోడించిన విషయాలు, వీటికి సంబందించిన పోస్టింగ్స్ వుంటాయి.
ఈ బ్లాగ్ ప్రారంభించాతానికి ఇంకో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే " రచన చేయటం నేర్చుకోడం కోసం"
అంతే తప్ప ఎవరిని ఉద్దేశ పూర్వకంగా ఇక్కడ ప్రస్తావించే ప్రసక్తి లేనే లేదు. దయ చేసి తమకి అన్వయిన్చుకోవోద్దని మనవి.
- చక్రధర్ రావు
Feb 21, 2010
మీరెన్ని వేషాలు వేసినా
వైకుంటం .. పాలసముద్రం చల్లగా ఉంది.. ఆ సముద్రం లో ఒక పెద్ద 10 తలల ఆది శేషుడు..
శ్రీ మహా విష్ణువు ఆది శేషుడి మీద పడుకుని ఒక కునుకు తీస్తునాడు.
లక్ష్మి దేవి ఆవలిస్తూ కాళ్ళు వత్తుతూ ఉంది.
దేవీ .. కొంచం గట్టిగ నొక్కు..ముల్లోకాలు తిరిగి నొప్పిగా ఉన్నాయి..ఏమండీ, నాకో చిన్న డౌట్.. మీరెన్ని దొంగ వేషాలు వేసినా I mean "అవతారాలు" వేసినా ..లోకం లో అన్యాయం ఆగటం లేదుకదండీ.. దోచేవాడు దోచేస్తూనే ఉన్నాడు, లేని వాడు నిత్యం చస్తూనే ఉన్నాడు. చూడబోతే మీరేమి "ఆక్షన్" తీసుకుంటున్నట్టు లేదు.
దేవీ .. సకలలోక పాలకుండ.. శేష తల్పుండ.. విశేష నామ దేయుండా... విష్ణు దేవుండ..
తోక్కేం కాదు.. అడిగింది చెప్పండి అంటే..మిమల్ని మీరు పొగుడు కుంటారేంటి ...తెలుగు సినిమా హీరోల్లాగా.
అంతకంటే చేయటనికేముంది దేవీ .. అడుగు ఏం చేయలేదో..
ఆ కుంభకోణం చేసిన మంత్రి గారిని ఏం చేసారు అంటా ?? కనీసం ఏదైనా శిక్ష వేసారా ?
అయ్యో దేవీ .. తెలిదా, అతను తిరపతి లో నాకు కిలో బంగారం ఇచ్చాడు..
అవునా (నాకు కనీసం వజ్రపుటుంగరం కూడా లేదాయే) పోనీ.. మరి ఆ ఖనిజం స్కాం సూత్రధారి ?? అతని సంగతేంటి ??
అతనా.. అతను నా గుడి కట్టటానికి పెద్ద మొత్తం లో చందా ఇచ్చాడు.
మరి...మరి..అని లక్ష్మి దేవి..ఆలోచిస్తుంటే..
చూడు దేవి.. ప్రతి వాడు ఎంతో కొంత ఇస్తూనే ఉన్నాడు..
ఇవ్వలేక పోయిన వాడికి నేను ఏదో ఒక కీడు చేస్తూనే ఉన్నా,ఇంకేం కావలి..
అది కాగ మనుషులు తెలివి మీరి పోయారు. బొత్తిగా పాప భీతి లేకుండా పోయింది, మహా అంటే పోతాం, పొతే పోయింది వెధవ జీవితం, ఉన్నన్నాళ్ళు అప్పో సప్పో.. మోసమో, దగానో ఏదోటి చేసి సుఖం అనుభవిస్తే చాలనుకొంటున్నారు, ఎంతటి ఘోరానికైన తెగిస్తున్నారు.
ఎక్కువగా మాట్లాడితే నువ్వు మాత్రం తక్కువ తిన్నావా అని పురాణాలు, భారత, భాగవతలో నేను చేసిన ఘన కార్యాలని ఏకరువు పెడుతున్నారు. నా వీక్ పాయింట్ తెలుసుకున్నారు, నా మోహన డబ్బు, నగా కొడుతుంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు ?
అయినా దేవీ .. నీ కెందుకు ఇవన్నీ .. హాపీ గా కాళ్ళు పట్టక.. మగని సేవ కంటే మగువ కి కావలసినదేముంది కనక ??
మగని సేవట, మీరేదో సామాన్య జనాలని ఉద్దరిస్తున్నారేమో, నేను మీ సేవ చేస్తే పుణ్యం కలిసొస్తుందని అనుకుంటున్నా...మీరు కూడా లంచాలకి మరిగి.. కుపరిపాలన చేస్తుంటే మీకు సేవ చేయాల్సిన కర్మ నాకేం పట్టలేదు. దేవీ.. అంత కంటే ఏం చేయగలవు దేవి.. హ్యాపీ గా నా సేవలో తరించు..
బ్రతికుంటే.. కాల్ సెంటర్ లో పనిచేసిన బ్రతుకుతా కాని మీ కాళ్ళు పట్టను..
అయ్యో దేవీ ... వెళ్తున్నావా..
(ఇదంతా ఓరకంట గమనిస్తున్న బ్రహ్మ దేవుడు ముసిముసి గా నవ్వుకుంటూ తన పని తాను చేసుకుంటున్నాడు)
Feb 20, 2010
ఎండాకాలం వోచ్చేస్తోందోచ్
మా ఇంటి ముందు కాలనీ రోడ్డంతా ఎండిపోయిన ఆకులు ఉన్నాయి.. ఎంటబ్బా , ఏమైంది ? ఇంత చెత్త ఎక్కడిది రోడ్డు మీద అనుకున్నా ..కొంచం తల ఎత్తు చూద్దును కదా..కానుగ చెట్లన్నిసగం బోసి పోయి కనిపించాయి.. అప్పుడు స్పురించింది.. ఎండాకాలం వోచ్చేస్తోందోచ్ ... చాలామందికి ఎండాకాలం అంటే చిరాకు ..నాకు మాత్రం ఎండాకాలం అంటే ఇష్టం,
చిన్నపుడు సెలవులు ఇస్తారని కాబోలు..కాని చెట్లకి ఆకులు రాల్చి కొత్త చిగుళ్ళు తోడిగేది, తెల్లని చిన్ని మల్లె పూలలో అద్భుతమైన పరిమళాన్ని నింపేది , నల్లని కోకిలమ్మ గొంతులో తేనే రాగలు పలికించేది, మావిళ్ళకి పూత పూయించి ,కాయలు కాయించి మధురమైన రుచిని మనకి పంచేది ఈ కాలమేగా.
నాకు చిన్నపుడు ఎండాకాలం బాగా గుర్తు. ఒంటి పూట బడి మూలంగా ఉదయం 7గంటలకల్లా హాయిగా చన్నీళ్ళతో స్నానం చేసి స్చూలికి పరిగెత్తే వాణ్ని. మా స్కూల్ ఆవరణలో మల్లె , గులాబీ మొక్కలు పుష్కలంగా ఉండేవి..గుమ్మలోనే మల్లెల వాసనా, గులాబీ రంగూ పలకరించేవి. గుండెనిండా ఆ పరిమళం నిండిపోయేది. ముందు బెంచిలో కూర్చొని.. మల్లెలకి అంత తెల్లదనం. అ పరిమళం ఎలా వొచ్చిందా అని ఒకటే ఆలోచన. మధ్యాన్నం కాగానే కొంత మంది పిల్లలని పిలిచి ఆ మొగ్గలు కోయించి అమ్మేవాళ్ళు. పావలాకి 25. కోయటానికి నేను ముందు ఉండేవాడిని.. మెల్లిగా ఎవరికీ తెలీకుండా ఓ నాలుగు మొగ్గలు జేబులో వేసుకొనే వాడిని ఆ పరిమళం కోసం.
ఇక ఒంటి పూట బడి వదలగానే గంగాపురం రోడ్డు వైపు పరుగు.. ఎందుకంటే అ రోడ్డుకి పక్కనే గా మామిడి చెట్లు ఉండేది. మామిడి పూలు పిందెలుగా మారటం చూసేవాళ్ళం .ఆ బుల్లి మామిడి పిందెల కోసం ఆరాటం , వాటిని ముక్కలు కోసి ఉప్పులో అద్దుకొని తినేవాళ్ళం.
ఎండ ఎక్కువ ఉందని బయట తిరగానిచ్చే వాళ్ళు కాదు నాలుగు గంటల దాక. అప్పుడు ఏ పుచ్చాకాయో .. కర్బుజ పండో.. నిమ్మకాయి షర్బత్తో తాగి.. ఆటలకి పరుగు. ఇసికలో పోద్దుగుంకే దాక ఆడి .. ఇల్లు చేరటం.
రాత్రి డాబా మీద వెన్నెల వెలుగులో..చుక్కల దుప్పటి కప్పుకొని తెలిసి తెలియని ఆలోచనలోంచి నిద్రలోకి.
చల్లని చిరుగాలి.. కోకిలమ్మ సుప్రభాతం తో ఉషోదయం, మళ్లీ ఓ కొత్త రోజు.. అదే సెలవు రోజైతే చిరుగాలి జోలపాట, కోకిలమ్మ లాలి పాట అయ్యేవి.
Feb 16, 2010
confessions of an Alky
అవును... తాగాను..
బీరు..విస్కీ..వోడ్కా..రం..బ్రాంది.. జిన్ .వైను..కల్లు.. ఏది దొరికితే అది తాగాను...
మొదట్లో.. అదో adventure లాగ ..ఎలా ఉంటుందో అన్న కుతూహలం కొద్దీ తాగాను ..
ఇంటర్ లో ఉన్నపుడే..రుచి చూసా..
తరవాత డిగ్రీ ఫైనల్ లో ఉన్నపుడు మరో సారి..ఆ తరవాత ఇంకోసారి...అలా అప్పుడప్పుడు..తాగా..
ఇక చదువు అంత ఐపోయి.. పని పాట లేనపుడు ..తాగా..
ఉహలకి,,నిజజీవితానికి వ్యతాసం తెలుసుకున్న కొద్దీ..తాగా..
ప్రపంచం గురించి వాస్తవం తేట తెల్లం అవుతుంటే అది జీర్నిచుకోటానికి తాగా...
సంతోషం లో..దుఖం లో.. తాగా..
మనసుని బండగా మార్చుకోవాలని తాగా..
ఎందుకు పనికిరాని వాడిని అని అనిపించినప్పుడల్లా తాగా..
నేను అందరికంటే గొప్ప అని ఫీల్ అయినపుడు తాగా ..
.ఫ్రెండ్స్ తో సరదాగా తాగా ..
ఒంటరితనాన్ని భరిచలేక తాగా
పార్టీ లో మొహమాటానికి తాగా..
కొన్ని సార్లు ఏమి చేయలేక తాగా
కొని సార్లు ఏమి చేతగాక.. తాగా
ప్రేమించే మనసు లేక..తాగా..
ప్రేమిచడం చేతగాక..తాగా..
సేద తీర్చే ఒడి లేక తాగా
సెక్స్ దొరక్క తాగా
యవ్వనం కరిగిపోతుంటే..తాగా..
వయసు మల్లిపోతోంటే ..తాగా..
కలలు కల్లలై పోతుంటే తాగా
జీవితం బుగ్గి పాలవుతుంటే తాగా..
పగలు పని లేక తాగా..
రాత్రి నిద్ర పట్టక తాగా..
నామీద నాకు నమకం లేక తాగా
నన్ను నమ్మేవాడు లేక తాగా
తెలుగులో రాయలేక తాగా
ఇంగ్లీష్ లో మాట్లాట్టం రాక తాగా
అనుకున్నది సాధించలేక ..సాధిచింది ఏమిలేక
జీవితం శూన్యమని.. శూన్యమే జీవితం అని.. తోచినపుడు ..
అందరు బానే ఉన్నారు ,,నేను మాత్రమే బాగాలేను అని ఫీల్ ఐనపుడల్లా..
నేను దురదృష్ట వంతుడ్ని అని నమ్మినప్పుడల్లా ... తాగాను.
అవును తాగాను..

Feb 13, 2010
తమిళ పొన్ను
ఊరి నుండి అప్పుడే వొచ్చి ముఖం కడుక్కొని..అమ్మ కలిపిన అటుకుల మూట విప్పి తింటున్నాం ఇద్దరం, నేను, వాసూ. . ఉప్పు కారం.. కొబ్బరి పొడి..వేసి కలిపిన అటుకులు కమ్మగా ఉన్నాయి ఇంతలో.. "రా రమ్మని రారా రమ్మని రామచిలుక పలికెను ఈ వేలా" .. అంతగా బాలేక పోయినా పదే పదే వినిపిస్తోంది ఓ అమ్మాయి గొంతు.. ఆ పదాలు పలకటం కూడా తెలుగు వాళ్ళ లా లేదు..
వాసు ని అడిగా " ఎక్కడిదా గొంతు.. ఎవరా పిల్ల"
అదా మధ్యాన్నం నిద్ర రాకుండా ఇదో గోల మొదలైంది మనకి.. కింద షాప్.. హాట్ చిప్స్ కి అద్దెకి ఇచ్చారు.. తమిళ వాళ్ళకి "
"ఓహ్ అవునా " అన్నాను మళ్లీ అదే పాట వింటూ..తమిళ యాసలో గట్టిగా బెరుకు లేకుండా పాడుతోందా పిల్ల.
వేడి చాయ్ పెట్టాడు వాసు.
వాసు చిన్ననాటి మిత్రుడు. కాని ఈ మధ్యే నేను వాసు రూం లో జాయిన్ అయ్యా. ఆటను చాల సాదా సీదా వ్యక్తి.. లైఫ్ ఇస్ సో సింపుల్ అతనికి. తన వల్లకాని..శక్తికి మించిన ఆలోచనలు చేయడు..full practical minded. ఉదయం 7 గంటల కల్లా లేచి చాయ్ తో పాటు న్యూస్ పేపర్ చూడటం, స్నానం..వంట ..భోజనం..కాసేపు విశ్రాంతి.. మధ్యాన్నం 1 గం ఆఫీసుకి వెళ్లి. రాత్రి 10 గంటలకి రావటం..అది అతని దిన చర్య.. ఆదివారం వొస్తే...ఓ సినిమా..అంతే.
నిద్ర లేవటానికి ఓ వేళా పాళా అంటూ లేని నేను వాసు రూం కీ షిఫ్ట్ అయ్యాక చాయ్ కోసం 7 కల్లా లేవటం అలవాటయ్యింది.
కాలేజీ నుండి సాయంత్రం 4 గం కి వొచ్చి కాసేపు పడుకునే వాడిని..ఈ పిల్ల పుణ్యమా అని ఆ నిద్ర లేకుడా పోయింది. లేటెస్ట్ సినిమా పాటలతో ఊదరగొట్టేది. ఎవరా పిల్ల ఎలా ఉంటుంది.. అనే కుతూహలం కూడా ఎక్కువవుతూనే ఉంది ఓపక్క .
ఓ రోజు మధ్యాన్నం కాలేజీ నుండి వొస్తూనే సరా సరి షాప్ కీ వెళ్ళా హాట్ చిప్స్ కొందామని..
"రా రా రమ్మని రామచిలుకా".... ఆపేసింది నన్ను చూసి,..
తమిళ నలుపు..అయినా ఏదో కళ .. తెల్లగా పెద్ద కళ్ళు .. 18- 19 మధ్య ఉంటుంది. హాట్ చిప్స్ వేయించి వేయించి మొహం కొంచం జిడ్డు ఓడుతోంది..నూనే పట్టించి వేసిన చిన్న జడ .. పెద్దగ చదువుకోలేదని మొహం చుస్తే ఎవరికైనా తెలుస్తంది.. కాని ఎదుటివారిని కట్టి పెడేసే గుణం ఏదో ఉంది..
నిర్భయంగా బెరుకు లేకుండా మాట్లాడం లోనే ఉందేమో..
"ఎం కావలి"
"చిప్స్ "
"పైన రూం లో ఉంటారా " నన్ను ఎప్పుడో గమనిచేసింది..
"అవును "
"సదూ కుంటున్నారా " తమిళ యాసలో ప్రశ్నలతో పాటు గుప్పెడు చిప్స్ ఎక్కువేసింది.
అది మొదలు.. అప్పుడప్పుడు నేను చిప్స్ కోసం వెళ్ళటం.. చిరునవ్వులు, పలకరింపులు హాయ్ లు బాయ్ లు . ఆ పిల్ల నా కళ్ళ లోకి తదేకంగా చూసేది నేనే మరల్చు కోవలిసి వొచ్చేది.
అది ఎండాకాలం ఒక రోజు నేను భోజనం చేస్తున్నా, వాసు మంచి కునుకో లో ఉన్నాడు.. ఇంతలో టక టక అని తలుపు చప్పుడైంది కింద.. మా రూం మొదటి అంతస్తులో..spiral stair case తో వింత గా ఉండేది. ఎవరా అని చెయ్యి కడుక్కోకుండా నే వెళ్లి తలుపు తీసా..
తమిళ పొన్ను.. " కొన్ని నీలిస్తారా " అని వాటర్ బాటిల్ చూపించింది.
"సరే పైకొచ్చి తీసుకో..నేను భోజనం చేస్తున్నా " అన్నాను,
నాతో బాటే అనుసరించిది. అదుగో ఆ కుండలో ఉన్నాయి అని చూపించా.
వెళ్లి గ్లాస్ తో బాటిల్ నింపటం మొదలు పెట్టి మళ్లీ కళ్ళతో కళ్ళు ముడేసింది. నాకు ఎలా తప్పింహుకోవలో తెలిలేదు. దగ్గరి కెల్లాను.. ముద్దు పెట్టు అన్నట్టుగా చెంప చూపించింది.
ఏమి ఆలోచించకుండా ముద్దు పెట్టాను. నీళ్ళ బాటిల్ వొదిలేసి.. చేతులు చాచింది..
నేను కోగిట్లో వాలాను. అలా రెండు మూడు నిముషాలు ఉండిపోయాం..అ అమ్మాయి చిన్నగా కదిలే సరికి విడి పడ్డాను.
ఎం మాట్లాడకుండా నీళ్ళ బాటిల్ తెసుకొని వెళ్లిపోయింది..

Subscribe to:
Posts (Atom)